Revanth Reddy | ‘ఫ్యూచర్ సిటీ’ వరకూ..

Revanth Reddy | ‘ఫ్యూచర్ సిటీ’ వరకూ..
Revanth Reddy | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అన్ని కోణాల్లో అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేపథ్యంలో విస్తరించిన హైదరాబాద్ మహానగరం దేశానికే తలమానికంగా అవతరించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షిం చారు. ఆ దిశగా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి జోనల్ కమిషనర్లు ప్రతి రోజూ ఫీల్డ్ వర్క్ తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. ఎంతటి వ్యయమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యం నెరవేర్చే బాధ్యత మీదె “నని వ్యాఖ్యానించారు. నగరాన్ని వివిధ జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్తగా నియమితులైన జోనల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ బంజారాహిల్స్లోని ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, ఆర్థిక శాఖలతో పాటు ఎఫ్ సీడీపీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డు తదితర అనుబంధ విభాగాల ఉన్నతాధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఫ్యూచర్ సిటీ’ వరకూ రాజధాని నగరం విస్తరణే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నిర్దేశిత కార్యాచరణతో ప్రణా ళికాబద్ధంగా అభివృద్ధి అవశ్యమని పేర్కొన్నారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తేనే… బహుళజాతి సంస్థల పెట్టు బడులకు సానుకూల వాతావరణం ఏర్పడు తుందని, ఇప్పటికే కుదిరిన ఎంవోయూలు కార్య రూపంలోకి వచ్చే అవకాశాలు మెరుగుపడ తాయని సీఎం (CM) అన్నారు.
