DSP CH Raja | అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు..

DSP CH Raja | అలా చేస్తే.. కఠిన చర్యలు తప్పవు..

DSP CH Raja | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రాబోవు 2026 నూతన సంవత్సర వేడుకలకు శాంతియుత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ సాదర స్వాగతం పలుకుదామని బందరు డి.ఎస్.పి సిహెచ్ రాజా తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంతోషాల నడుమ నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని దానికి పోలీస్ వారు సూచించిన ఆదేశాలు పాటించాలని తెలిపారు. బందర్ సబ్ డివిజన్ పరిధిలో విరివిగా పోలీస్ చెక్ పోస్టులను, అలాగే డ్రోన్ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు మైనర్ డ్రైవింగ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం తాగి వాహనం నడిపినా, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు. రహదారుల పై మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడపడం సైలెన్సర్లు తీసివేసి అధిక శబ్దంతో ప్రజా జీవనానికి ఆటంకం కలిగించడం ర్యాలీలు నిర్వహించడం నిషేధం. రహదారుల వెంబడి, బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం, కేకులు కట్ చేయడం డిజే బాక్స్లు వినియోగించడం వంటివి చేయరాదు. నూతన సంవత్సర వేడుకల పేరుతో సముద్రతీర ప్రాంతానికి ప్రవేశం లేదు. కావున ఎవరు సముద్రం వద్దకు వెళ్లరాదు. కావున పోలీసు వారి ఆదేశాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటూ, పోలీసు వారికి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply