317 G.O | డీఏలు, పీఆర్సీ ప్రకటించాలి…
- బకాయిలను విడుదల చేయాలి
- ఎన్ఈపీ-2020 రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయాలి
- కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసి వేతనాలను సవరించాలి
- 317జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
- మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలి
- శాసన మండలిలో ఎమ్మెల్సీ కొమరయ్య
317 G.O | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఉపాధ్యాయుల సమస్యలపై గళమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాల(Government school)ల్లో అనేక సమస్యలున్నాయని, విద్యార్థి, విద్యార్థినులకు కనీసం మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని అన్నారు. మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాల్లో ఉపాధ్యాయులు చాలా ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, రూ.10 వేలు, రూ.12 వేలు, రూ.20 వేలు తదితర చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి పే స్కేలు అమలు చేయడంతోపాటు వారిని రెగ్యులరైజ్ చేయాలని, రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్ల(194 model schools)లో పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది రెగ్యులర్ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి.. వారికి 010 పద్దు ద్వారా వేతనాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
317 G.O |రేషనలైజేషన్ చేయాలి…

ప్రభుత్వ బడుల్లో జీరో ఎన్ రోల్ మెంట్ గురించి కొమరయ్య ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘2024-–25 అకడమిక్ ఇయర్(academic year)లో మన రాష్ట్రంలో 2,245 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుని ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగించాలి. విద్యార్థులు ఉన్న చోట టీచర్ల కొరత ఉన్నది..
టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరు.. కాబట్టి రేషనలైజేషన్ చేయాలి. రాష్ట్రంలో డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. పీఆర్సీ ఇవ్వలేదు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. 317 జీవో(317 G.O) బాధితులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం కొంత తాత్కాలిక ఉపశమనం కలిగించినా.. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. టీచర్లు 100 నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బడికి వెళ్లాల్సి వస్తున్నది. 317 జీవో సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి”అని ఎమ్మెల్సీ కోరారు.
317 G.O | పెండింగ్ బకాయిలు..


మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభ దృష్టికి తెచ్చారు. దాదాపు 14,000 మంది పెన్షనర్లు(14,000 pensioners) బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించాలని కోరారు. ‘‘బకాయిలు నెలకు రూ.700 కోట్లు(Rs.700 crore) చెల్లిస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా.. ఇంతవరకూ అది అమలు కాలేదు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మంచి హెల్త్ స్కీమ్, క్యాష్ లెస్ హెల్త్ కార్డు తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు అది జరగలేదు.

దాన్ని వెంటనే అమలు చేయాలి. వందలాది ప్రభుత్వ బడులు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గురుకుల టీచర్లు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ” అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభలో మాట్లాడారు.
CLICK HERE TO READ MORE నిధి అగర్వాల్ క్రేజీ కాంబో సాధ్యమేనా..?
మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభ దృష్టికి తెచ్చారు. దాదాపు 14,000 మంది పెన్షనర్లు బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించాలని కోరారు. ‘‘బకాయిలు నెలకు రూ.700 కోట్లు(Rs.700 crore) చెల్లిస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా.. ఇంతవరకూ అది అమలు కాలేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మంచి హెల్త్ స్కీమ్, క్యాష్ లెస్ హెల్త్ కార్డు తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు అది జరగలేదు.
దాన్ని వెంటనే అమలు చేయాలి. వందలాది ప్రభుత్వ బడులు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గురుకుల టీచర్లు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ” అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభలో మాట్లాడారు. మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభ దృష్టికి తెచ్చారు. దాదాపు 14,000 మంది పెన్షనర్లు బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, తక్షణమే వాటిని చెల్లించాలని కోరారు. ‘‘బకాయిలు నెలకు రూ.700 కోట్లు(Rs.700 crore) చెల్లిస్తామని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా.. ఇంతవరకూ అది అమలు కాలేదు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. 2010 కంటే ముందుగా నియామకం అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మంచి హెల్త్ స్కీమ్, క్యాష్ లెస్ హెల్త్ కార్డు తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు అది జరగలేదు. దాన్ని వెంటనే అమలు చేయాలి. వందలాది ప్రభుత్వ బడులు, గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గురుకుల టీచర్లు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ” అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సభలో మాట్లాడారు.

