Sinare | Songs | అందాకా ఏగేదెట్టగా..

Sinare | Songs | అందాకా ఏగేదెట్టగా..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమ్మ మాట సినిమాలో.. సినారే ఓ పాట(Sinare is a song) రాశారు. అదే.. మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు.. నా మనసే లాగేసిండు.. లగ్గమెప్పుడురా మావా అంటే.. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే.. ఆగేదెట్టగా.. అందాకా ఏగేదెట్టగా అనే పాట ఉంది. నాడు విశేషంగా ఆకట్టుకున్న ఆ పాట నేటికీ వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు కొన్ని క్రేజీ సినిమాలు(Crazy movies) షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయబ్బా… ఆగెదెట్టగా.. అందాకా ఏగేదెట్టగా అన్నట్టుగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి.. అంతలా ఎదురు చూసేలా చేస్తున్న ఆ క్రేజీ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Sinare | Songs | సూపర్ స్టార్.. వారణాసి..

Sinare

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ(Huge pan world movie) వారణాసి. ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్.. మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్(Title and Glimpse Release) చేశారు. ఈ గ్లింప్స్ రిలీజైన తర్వాత ఆకాశమే హద్దు అనేలా సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఇందులో మహేష్‌ బాబు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తుండడం విశేషం. దాదాపు 1000కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2027లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. అయితే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్(Super star fans) మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ సైతం ఆగేదెట్టగా.. అందాకా ఏగేదెట్టగా.. అంటున్నారు.

Sinare | Songs | ఐకాన్ స్టార్ క్రేజీ మూవీ..

Sinare

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్(Directed by Lewood star director Atlee) లో పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోంది. ఈ మూవీని కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. ఇందులో బన్నీ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఇంత వరకు బన్నీ చేయని వైవిధ్యమైన పాత్ర(Diverse character)లో కనిపిస్తాడని.. ఓ కొత్త లోకాన్ని ఆవిష్కరించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2026 జూన్ కు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ టైమ్ పడుతుందట. అందుచేత 2027 బిగినింగ్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ఒకవేళ కుదిరితే.. 2026 ఎండింగ్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్(Maker’s Plan) అని సమాచారం. ఈ క్రేజీ మూవీ కోసం కూడా అందాకా ఆగేదెట్టగా అన్నట్టుగా సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Sinare | Songs | యంగ్ రెబల్ స్టార్ స్పిరిట్..

Sinare

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ జనవరి 9న థియేటర్స్(Theaters) లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తోన్న స్పిరిట్ ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన స్పిరిట్ నాన్ స్టాఫ్(Spirit Non-Staff) గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియో అయితే.. జనాలకు విపరీతంగా నచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో.. సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేయడంతో.. స్పిరిట్ మూవీ ఎప్పుడు వస్తుంది.. ఆగేదెట్టాగా.. అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Sinare | Songs | యంగ్ టైగర్ డ్రాగన్..

Sinare

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న మూవీ డ్రాగన్. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంతన్ నటిస్తుంది. వార్ 2 మూవీ ప్లాప్ అవ్వడంతో.. ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ చేసిన తాజా షెడ్యూల్(Latest schedule) లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని సమాచారం. జూన్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ.. వార్ 2 కారణంగా షూటింగ్ కి బ్రేప్(Break for shooting) పడింది. అందుచేత జూన్ 25న రావడం లేదని టాక్. ఈ సినిమా కోసం కూడా ఆతృతగా ఆగేదెట్టాగా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు.

Sinare | Songs | నాగ్ 100..

Sinare

టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్(Kollywood director Karthik) తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఇందులో సీనియర్ హీరోయిన్స్ టబు, అనుష్క కీలక పాత్రలు పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి. నాగ్ మాత్రం ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్(Silent shooting) చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య, అఖిల్ గెస్ట్ రోల్ చేయనున్నారని సమాచారం. ఇలా.. అక్కినేని హీరోలు కలిసి నటిస్తుండడం.. ఇది నాగ్ 100వ సినిమా కావడంతో.. ఆగేదెట్టాగా అంటూ సోషల్ మీడియా(social meadia)లో అప్ డేట్స్ కోసం పోస్టులు పెడుతున్నారు నాగ్ ఫ్యాన్స్. ఇలా.. ఈ క్రేజీ మూవీస్ కోసం ఆగేదెట్టాగా.. అంటూ ఎదురు చూస్తున్నారు. మరి.. ఈ క్రేజీ మూవీస్ లో ఏ ఏ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్(Biggest Blockbusters) సాధిస్తాయో చూడాలి.

CLICK HERE TO READ పవర్ స్టార్.. ఇది నిజమా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply