Sarpanch Girija Ravi | నట్టల నివారణ మందుల పంపిణీ

Sarpanch Girija Ravi | నట్టల నివారణ మందుల పంపిణీ
Sarpanch Girija Ravi | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని తీర్పేల్లి గ్రామంలో శనివారం గొర్రెలకు నట్టల నివారణ మందులు అందించారు. సర్పంచ్ గిరిజ రవి ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వెటర్నరీ డాక్టర్ సంతోష్, గ్రామ వార్డ్ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
