నీళ్ల ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన..
నీళ్ల ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన..
ఇందిరమ్మ ఇల్లుకై ఆత్మహత్యాయత్నం..
భార్య పేరుపై మొదటి లిస్టులో ఇల్లు మంజూరు..
భార్య చనిపోవడంతో ఎడిట్ ఆప్షన్ లేకుండా నిలిపివేత..
జన్నారం, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తూ,నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఇది.మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామంలోని కట్టెకోల రాము ఇందిరమ్మ ఇల్లు రాలేదని శుక్రవారం గ్రామ సమీపాన ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతూ,నిరసన వ్యక్తం చేశారు.రాము భార్య పేరుపై మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో ఇల్లు మంజూరైనప్పటికీ, ఆమె చనిపోవడంతో నిలిపివేశారు. ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్ లేక పోవడంతో ఆమె పేరుపై ఉన్న ఇల్లును రద్దుచేసి భర్తకు కేటాయించలేకపోయారు.ఈ విషయాన్ని గమనించకుండా ఆ రాము ఇల్లు మంజూరు కాలేదని ఆవేదనతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు.దీంతో గ్రామ సర్పంచి అజ్మీర కళావతి-నందునాయక్ ఆ యువకునికి నచ్చజెప్పి ఎడిట్ ఆప్షన్ రాగానే రెండో విడత ఇందిర ఇండ్లలో భార్య పేరుపై రద్దుచేసి భర్త పేరుపై ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని తెలిపారు.
