New transformer | రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభాలు

New transformer | రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభాలు
- ప్రమాదం పొంచి ఉన్నా స్పందించని విద్యుత్ అధికారులు
- ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు సాగిస్తున్న రైతులు
New transformer | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన రైతు కొడారి రాజు పొలంలో విద్యుత్ స్తంభం(Electric pole) అత్యంత ప్రమాదకరంగా మారింది. స్తంభం వంగి ఒడ్డుపై ఉండడంతో చుట్టు పక్క రైతులు తమ పొలం పనులకు ఆ ఒడ్డుపై వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
అంతేకాక స్తంభం వంగి ఉండడంతో విద్యుత్ సమస్య కూడా తలెత్తి, తరచుగా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడి తమ బావులకు అమర్చిన మోటార్లు(motors) పదే పదే కాలిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ స్తంభాన్ని సరిచేయాలని, సమస్యపై విద్యుత్ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని రైతు కొడారి రాజు ఆరోపించారు.
తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పొలంలో వ్యవసాయ పనులు(agricultural work) చేసుకుంటున్నానని కొడారి రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ పై అధికారులు స్పందించి తన పొలంలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాన్ని సరిచేసి, తనకు చుట్టుపక్కల రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా ఇంకా గ్రామంలోని చాలా వ్యవసాయ పొలాల్లో స్తంభాలు ఇలానే ఉన్నాయని, విద్యుత్ సిబ్బందికి రైతుల వద్ద డబ్బులు గుంజుతూ కొత్త ట్రాన్స్ ఫార్మర్(new transformer) లు అమర్చి, కొత్త విద్యుత్ స్తంభాల లైన్, వైర్లు బిగించడంలో చూపే ఉత్సాహం వాటి మరమ్మత్తుల విషయంలో మాత్రం తమకేమీ సంబంధమంటూ బుకాయించడం సరికాదని అంబారిపేట రైతులంతా ఆరోపిస్తున్నారు.
