Earthquake | గుజ‌రాత్ లో భూకంపం

Earthquake | గుజ‌రాత్ లో భూకంపం

Earthquake | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : గుజ‌రాత్ (Gujarat) రాష్ట్రంలో భూకంపం వచ్చింది. రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఇవాళ ఉదయం 4.4 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఉదయం 4:30 గంటల సమయంలో నమోదైన ఈ భూకంపం లోతు 10 కిలోమీటర్లు కాగా, ఎపిసెంటర్ 23.65 ఉత్తర అక్షాంశం, 70.23 తూర్పు రేఖాంశంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ప్రస్తుతం ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

Leave a Reply