Road Accident | మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రిగ్భాంతి..

Road Accident | మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రిగ్భాంతి..
Road Accident | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి (Road) పై నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పై జిల్లా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరంఅని రాష్ట్ర ఆర్ అండ్ బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఫరూక్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం పై జిల్లా అధికారులను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీసారు.
ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు సూచించారు. మృతుల కుటుంబాలకు (family) ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో ప్రయాణికులు, వాహనదారులు, అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని.. అతివేగం ప్రమాదకరమని సూచించారు. మనకందరికీ కుటుంబాలు ఉన్నాయని.. అతివేగంతో ప్రయాణించి కుటుంబాలకు నష్టం కలిగించకూడదని వారు ఆవేదనతో తెలిపారు.
