Statue unveiling | భారీగా తరలివెళ్లిన అవనిగడ్డ నియోజకవర్గం

Statue unveiling | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకల సందర్భంగా అమరావతిలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి భారీగా తరలివెళ్లారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా అవనిగడ్డ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులను దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కూటమి ముఖ్య నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
