Bangladesh | మరో హిందూ యువకుడి దారుణ హత్య..

Bangladesh | మరో హిందూ యువకుడి దారుణ హత్య..

ఆంధ్ర‌ప్ర‌భ : బంగ్లాదేశ్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ (29) అనే హిందూ యువకుడిపై ఒక గుంపు దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీయడం కలకలం రేపుతోంది.

ఈ నెలలోనే మైమెన్‌సింగ్‌లో దిపు చంద్ర దాస్ అనే వస్త్ర కార్మికుడిని ఇదే తరహాలో కొట్టి చంపిన వార్తలు మరువక ముందే, మరో హిందూ యువకుడు బలికావడం అక్కడి హిందువుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ దాడులు పథకం ప్రకారం జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పంగ్షా గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమృత్ మండల్ అలియాస్‌ సామ్రాట్ క్రిమినల్ ముఠా నడుపుతున్నాడని, దోపిడీలకు పాల్పడుతున్నాడని బంగ్లాదేశ్‌ పోలీసులు ఆరోపించారు.

Leave a Reply