Meeting | ప్రజలు అప్పగించిన పదవికి న్యాయం చేయాలి..

Meeting | ప్రజలు అప్పగించిన పదవికి న్యాయం చేయాలి..
- హైకోర్టు న్యాయవాది రామిరెడ్డి..
Meeting | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూర్ పట్టణ ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రముఖ న్యాయవాది రామిరెడ్డి సూచించారు. గురువారం పట్టణ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ హైదరాబాద్ లోని వారి నివాసంలో రామిరెడ్డి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ని న్యాయవాది పుష్పగుచ్చాలతో అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని.. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణ అభివృద్ధిలో తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్ న్యాయవాది కుటుంబ సభ్యులు ఉన్నారు.
