Viswak Sen | ఫంకీ.. ఫన్ వేరే లెవెల్..
Viswak Sen | ఫంకీ.. ఫన్ వేరే లెవెల్..
Viswak Sen | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్(Carafe address) గా మారాడు దర్శకుడు కె.వి. అనుదీప్. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న చిత్రం ఫంకీ. ఇందులో విశ్వక్ సేన్ కు జంటగా కయాదు లోహార్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన(Excellent response) లభించింది. తాజాగా ఫస్ట్ సింగిల్ ధీరే ధీరే.. రిలీజ్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఆ ఇద్దరికీ టర్నింగ్ పాయింట్(A turning point for both of them) కానుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరు..? మూవీ ఎలా ఉండబోతుంది..? ఎప్పుడు రాబోతోంది..?
Viswak Sen | చార్ట్ బస్టర్..

ఫంకీ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ధీరే ధీరేకి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్(Director K.V. Anudeep) సాహిత్యం అందించడం విశేషం. వినసొంపుగా ఉన్న ఈ ధీరే ధీరే మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాటలో కొత్తదనం ఉట్టిపడటమే కాకుండా, యువతకు చేరువయ్యేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో శైలి సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆయన శైలిలో సాగిన ఈ ధీరే ధీరే పాట(Dheere Dheere song) తక్షణ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
Viswak Sen | స్వచ్ఛమైన వినోదం..

ఈ మూవీ ఎలా ఉండబోతుందంటే.. నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరుగాంచిన అద్భుతమైన కలయికలో ఫంకీ రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన స్టైల్ కామెడీ(Style comedy) విందుతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రాబోతున్నారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. జాతిరత్నాలు సినిమాతో(With the movie Jathiratnalu) సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే కామెడీతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలి పాట ధీరే ధీరేతో ఆ విషయాన్ని రుజువు చేశారు.
Viswak Sen | ప్రేమికుల దినోత్స కానుక..

ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార(Famous production companies Sitara) ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫంకీపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఫంకీ చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం(Film team) హామీ ఇచ్చింది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ సరికొత్త జోడి, విభిన్న పాత్రలు, ఉత్సాహభరితమైన సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి పేరొందిన దర్శకుడు.. ఈ అన్ని అంశాలతో ఫంకీ చిత్రం వెండితెర పై అపరిమిత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం(Valentine’s Day) కానుకగా ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో రాబోతుంది ఫంకీ. మరి.. ప్రేక్షకులకు వినోదాల విందుని అందించి.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి.. విశ్వక్, అనుదీప్.. ఈ ఇద్దరి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందేమో చూడాలి.
