Karnataka | ఘోర రోడ్డు ప్రమాదం..

Karnataka | ఘోర రోడ్డు ప్రమాదం..

Karnataka, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి గోకర్ణ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనం అయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధం అయ్యాయి. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. హిరియూర్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ డివైడర్‌ దాటి రాంగ్‌రూట్‌లో బస్సును ఢీకొట్టింది. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రంజిత్ పరిశీలించారు. ఘటన పై హిరియూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Leave a Reply