నైపుణ్య శిక్షణ.. అతివలకు ఆర్థిక స్వావలంబన…

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : మహిళల్లో ఉన్న సృజనాత్మకత నైపుణ్యాలను వెలికి తీసి వారికి అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ తర్ఫీదు ఇప్పించి వారిని మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యతీస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎన్ ఐ ఆర్ డి సహకారంతో జిల్లాలో ఉన్న మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు ఎంపీ కేశినేని చిన్ని శ్రీకారం చుట్టారు.
నెల నుండి మూడు నెలల పాటు వివిధ అంశాలలో మహిళలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించడం ద్వారా నైపుణ్య మెలకువలు తెలుసుకుని వారి స్వయం ఉపాధి పొందే విధంగా వాళ్లకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 400 మందికి పైగా మహిళలకు వివిధ దశల్లో శిక్షణ ఇప్పించిన ఎంపీ కేసినేని శివనాద్ ఎన్టీఆర్ జిల్లాను మహిళా పరిశ్రమకు వేత్తల తయారీ, నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తి ప్రణాళిక బద్ధంగా..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలను ప్రణాళిక బద్ధంగా ఎంపీ కేసీనేని శివనాద్ తాను ఎన్నికైన నాటినుండి ప్రారంభించారు. గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ రూరల్ టెక్నాలజీ పార్కును సందర్శించిన ఆయన అక్కడ ఉన్న అవకాశాలు జిల్లా యువతకు మహిళలకు ఉపయోగపడే అంశాలపై అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించారు.
వికసిట్ పంచాయతీ లక్ష్యంతో గ్రామీణ అభివృద్ధికి ప్రణాళిక వేసిన ఆయన అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించి ప్రణాళికలను రూపొందించారు. గత ఏడాది డిసెంబర్లో 50 మంది గ్రామీణ యువతీ యువకులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఆయన ఒకేరోజు అవగాహన సదస్సులో మొట్టమొదటిసారిగా తిరువూరు నియోజకవర్గం నుండి యువతీ యువకులను పంపించారు.
ఈ ఏడాది జనవరిలో స్వయం ఉపాధి రంగంలో ఎన్ఐఆర్డీఏలో ఇచ్చే శిక్షణ గురించి వివరించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేకంగా నియోజకవర్గంలోని రూరల్ అర్బన్ స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించరూ. రెండో విడతగా రూరల్ నియోజకవర్గానికి చెందిన 16 మండలాల స్వయం సహాయక సంఘాల సమైక్య అధ్యక్షులతో 30 మంది ఎస్ఎస్సి సభ్యులతో ఎన్ఐఆర్డీ లో ప్రత్యేక శిక్షణను ఇప్పించారు.
వీరు ఎనర్జీ సఫీషియెంట్ విలేజ్ హెల్త్ విలేజ్ చైల్డ్ వెల్ఫేర్ విలేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ విలేజ్ ఉమెన్ ఫ్రెండ్లీ విలేజ్ ప్రాపర్టీ విలేజ్ ఎలా అభివృద్ధి చేసే అంశాలను నేర్చుకున్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు మార్కెటింగ్ నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడే విధానాలను మహిళా అందించే క్రమంలో ఎన్ఐఆర్డీ తో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుని వాటి అమలు కోసం జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు.
డిసెంబర్ నుండి ప్రారంభమైన శిక్షణ..
కేశినేని ఫౌండేషన్ ఎన్ఐఆర్డీ సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలి లోనే ఎఫ్డిడిఐ లో లెదర్ నాన్ లెదర్ గార్మెంట్స్ పై నెలరోజుల శిక్షణను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 30 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు నెలరోజుల పాటు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. వీటితో పాటు చిరుధాన్యాలు సాగు సోయా ప్రొడక్ట్స్ పై ఐదు రోజుల శిక్షణను 40 మహిళా సంఘాల సభ్యులకు ఇప్పించారు.
హోమ్ బెస్ట్ హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ పై ఐదు రోజుల శిక్షణను రెండో విడతగా 61 మంది మహిళలకు ఇప్పించడంతోపాటు 31 మందికి తయారీలో పూర్తిస్థాయి తర్ఫీదును ఇప్పించారు. వీటితోపాటు వర్మీ కంపోస్టింగ్ నేచురల్ వ్యవసాయము తేనె తయారీ పై ఐదు రోజుల శిక్షణ కంప్రసిడ్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్రిక్స్ తయారీలో మూడు రోజుల శిక్షణ, వివిధ దశల్లో సుమారు 100కు మంది పైగా మహిళలకు శిక్షణను ఇప్పించారు.
ఈనెల 22వ తేదీ నుండి విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో చెదలు బొద్దింకలు దోమల నివారణ పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మహిళలకు తర్ఫీదు ఇప్పించారు మెప్మా కు చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన 50 మంది మహిళలు వీటిలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా..
మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న సమయంలో వారు స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడే క్రమంలో ఆర్థిక అభివృద్ధి సాధికారత కోసం కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాద్ ఎన్ ఐ ఆర్ డి సహకారంతో జిల్లాలో ఉన్న మహిళలందరికీ శిక్షణ ఇప్పించేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
మహిళలు స్వయం ప్రతిపత్తి తో పాటు స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ, అవగాహన కల్పించేందుకు సుమారు 12 అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో తర్ఫీదేవ్వడంతో పాటు మార్కెటింగ్ మెలకువలను కూడా నేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 294 పంచాయితీలలో కుటీర పరిశ్రమల ఏర్పాటు మహిళల ఆకాంక్షలు వారిలో ఉన్న నైపుణ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
శిక్షణ అనంతరం స్వతహాగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ రుణాలు కూడా మంజూరు చేసే విధంగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరి ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేయడం వీరికి విస్తృత ప్రచారం కల్పించడం మార్కెటింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
రాజకీయాలకతీతంగా..
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చిన మహిళలందరికీ వారికి ఇష్టమైన అంశాలలో పూర్తి శిక్షణ ఇప్పిస్తాం. వారికి పెట్టుబడి సహాయం చేసే క్రమంలో బ్యాంకు రుణ సదుపాయాలను కూడా కల్పిస్తాం. మార్కెటింగ్ మెలకువలతో పాటు అవసరమైన అన్ని శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. మహిళా సాధికారతకు ఇది ఒక మెట్టు మాత్రమే. అని కేశినేని శివనాత్ అన్నారు.
