Munugodu | చెక్కుల పంపిణీ

Munugodu | చెక్కుల పంపిణీ

Munugodu | మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్ నేలపట్ల నరేష్ ఇవాళ‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడపడుచు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 22మంది లబ్ధిదారులకు రూ.22,02,552 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Munugodu

ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, ఆర్ ఐ చింతనూరి వంశీ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు అద్దంకి రామలింగయ్య, కదిరే లింగస్వామి, జాల జంగయ్య యాదవ్, బొల్లం రమేష్ యాదవ్, జీడిమడ్ల సైదులు, వరికుప్పల భువనేశ్వరి విజయ్, పగిడిమర్రి కవిత నరసింహ చారి, జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచులు వెదిరె విజేందర్ రెడ్డి, గుల్లి శంకర్, షేక్ జాన్ పాషా, వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply