School | ఆక్స్ఫర్డ్ లో క్రిస్మస్ వేడుకలు

School | ఆక్స్ఫర్డ్ లో క్రిస్మస్ వేడుకలు
School | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇవాళ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెద్ది నరేందర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. క్రీస్తు జననం, మానవాళికి ఆయన అందించిన సందేశంతో పాటుగా, శాంతి, ప్రేమ, ఆదరణలపై యేసు ప్రభువు ప్రపంచానికి చాటిచెప్పిన అంశాలను విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పెద్ది పద్మ, నమ్ముల ఆనందకుమార్, షేక్ షమీం, ఎస్ జ్యోతి, ఎం ధనలక్ష్మి, పి రమాదేవి, ఎన్ మాధవి, సుబేదా, ఏ మౌనిక, ఆసియా, సంపూర్ణ, స్వప్న, లింగస్వామి, కీర్తి, తదితరులు పాల్గొన్నారు.
