Panchayat Secretary | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టండి

Panchayat Secretary | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టండి

Panchayat Secretary | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని ఊట్కూర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఊట్కూర్ మండల కేంద్రానికి మొదటి విడత 93 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, రెండో విడత 16ఇండ్లు మంజూరు చేసిందన్నారు.

ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, లబ్ధిదారులు పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ప్రభుత్వం దశలవారీగా బిల్లులు చెల్లిస్తుందన్నారు. ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత వార్డు సభ్యులు కుంటిమారి భరత్, కలాల్ అశోక్ గౌడ్, పల్లె అనిల్ రెడ్డి పంచాయతీ సిబ్బంది పోలప్ప, కనకప్ప ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply