Utkoor | నట్టల నివారణ మందులు వేయించండి
Utkoor | నట్టల నివారణ మందులు వేయించండి
Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గొర్రెలు మేకల పెంపకందారులు తమ పశువులకు విధిగా నట్టల నివారణ మందులు వేయించాలని ఊట్కూర్ పశు వైద్యాధికారి సాయివరుణ్ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమిన్ పూర్ లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు నట్టల నివారణకు మందులు పంపిణీ చేస్తుందన్నారు. 6610 గొర్రెలకు, 291 మేకలకు మందులు వేసినట్లు తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, టప్పా నాగేష్, వెటర్నరీ అసిస్టెంట్ శివప్రసాద్ ఎల్ ఎస్ ఏ రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
