
Student | ఆత్మహత్య..
Student | ఆత్మహత్య..
నెల్లిమర్ల, ఆంధ్ర ప్రభ : స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థి కూనేటి మహేష్ (22) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక వసతిగృహంలో ఉన్న రీడింగ్ రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయాడు. మంగళవారం అర్ధరాత్రి చనిపోగా, ఉదయం 6 గంటలకు తోటి విద్యార్థులు చూసారు. మహేష్ సాలూరు మండలం జిల్లేడువలస గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
