MCU | మళ్ళీ షీల్డ్ పట్టనున్న కెప్టెన్ అమెరికా..

MCU | మళ్ళీ షీల్డ్ పట్టనున్న కెప్టెన్ అమెరికా..

  • ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ టీజర్ రిలీజ్!
  • గెట్ రెడీ ఫర్ ది అల్టిమేట్ డూమ్స్‌డే!

ఆంధ్ర‌ప్ర‌భ : మార్వెల్ ఫ్యాన్స్‌కు మ‌తిపోగొట్టే అప్డేట్ వ‌చ్చేసింది. కేవలం 80 సెకన్ల పాటు మెరిసిన ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday) టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లోని మన ఒరిజినల్ హీరో, ఫస్ట్ అవెంజర్ స్టీవ్ రోజర్స్ మళ్ళీ షీల్డ్ పట్టుకోబోతున్నాడు. ఈ అప్డేట్ మార్వెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తొంది.

స్టీవ్ రోజర్స్ ఈజ్ బ్యాక్!

టీజర్ ఓపెనింగ్‌లో వయసు మళ్ళిన స్టీవ్ రోజర్స్ ఒక పీస్ఫుల్ గా ఫామ్‌ హౌస్‌లో తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ కనిపిస్తాడు. తన పాత బ్లూ హెల్మెట్‌ను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు స్టీవ్, అదే స‌మ‌యంలో అతను ఒక చిన్న పాపను ఎత్తుకుని ఎమోషనల్ అయ్యే సీన్ ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేస్తోంది.

కానీ ఆ ప్రశాంతత ఎంతో సేపు ఉండదు! అకస్మాత్తుగా ఒక వింతైన ఆకుపచ్చని వెలుగు (Green Glow) ప్రమాదాన్ని సూచిస్తూ మెరుస్తుంది. దీంతో మళ్ళీ ప్రపంచాన్ని రక్షించేందుకు క్యాప్ సిద్ధమయ్యాడని స్పష్టమవుతోంది. టీజర్ చివర్లో “Steve Rogers will return for Avengers: Doomsday” అనే కార్డ్ పడగానే గూస్ బంప్స్ వ‌స్తాయి.

ఇది కూడా చదవండి : Dhurandhar | 1000 కోట్ల దిశగా ధురంధర్

MCU

బాప్ ఆఫ్ ఆల్ క్లాషెస్: డాక్టర్ డూమ్ వర్సెస్ కెప్టెన్ అమెరికా!

ఈ సినిమాతో కేవలం క్రిస్ ఎవెన్స్ కంబ్యాక్ క‌న్ఫామ్ చేయ‌డ‌మే కాకుండా.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లోని అసలైన గోల్డెన్ టీమ్ మళ్ళీ కలుస్తొంది. దీంతో నెక్స్ట్ లెవల్ హైప్‌ను క్రియేట్ అయ్యింది. ‘వింటర్ సోల్జర్’, ‘సివిల్ వార్’, ‘ఎండ్‌గేమ్’ వంటి క్లాసిక్స్‌ను మనకిచ్చిన మాస్టర్ మైండ్ డైరెక్టర్లు రుస్సో బ్రదర్స్ (Russo Brothers) మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. అటు ఐరన్ మ్యాన్‌గా మనల్ని అలరించిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఇప్పుడు మోస్ట్ పవర్‌ఫుల్ విలన్ ‘డాక్టర్ డూమ్’గా రావడం, ఇటు క్రిస్ ఎవాన్స్ మళ్ళీ షీల్డ్ పట్టుకోవడం చూస్తుంటే.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 18న వరల్డ్ వైడ్ విధ్వంసం…

స్టెయిన్డ్-గ్లాస్ పోస్టర్‌తో మార్వెల్ రిలీజ్ చేసిన ఈ అప్‌డేట్… MCU ఫేజ్ సిక్స్‌కు (Phase Six) అసలైన ఊపునిచ్చింది. మల్టీవర్స్ రక్షణ కోసం “ఐ కెన్ డూ దిస్ ఆల్ డే” అని చెప్పే మన స్టీవ్.. డాక్టర్ డూమ్ ప్లాన్స్‌ను ఎలా తిప్పికొడతాడనేది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్. డిసెంబర్ 18, 2026న ఈ ఎపిక్ క్లాష్ వెండితెరపైకి రాబోతోంది. ఇక ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాల్సిందే.. ఎందుకంటే అవెంజర్స్ మళ్ళీ అసెంబుల్ అయ్యే సమయం వచ్చేసింది!

MCU