International Missions | క్రీస్తు బోధనలు అనుసరణీయం
International Missions | క్రీస్తు బోధనలు అనుసరణీయం
- క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
International Missions | మంథని, ఆంధ్రప్రభ : ఏసుక్రీస్తు ప్రేమ త్యాగం గొప్పవని, ఆయన బోధనలు అందరూ అనుసరించదగినవని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఇవాళ మంథని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంథని పట్టణంలోని సీయోను ప్రార్థన మందిరం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యేసు క్రీస్తు జన్మ పవిత్రమైనదని, క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మిషన్స్(International Missions) ఇండియా ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్, సీయోను ప్రార్థన మందిరం పాస్టర్లు దూడ మహేష్, మంథని మార్క్, అజ్మీరా దయారాజు, కలువల శామ్యూల్, సంఘ పెద్దలు ఎంకే జోసఫ్, రామగిరి కుమార్, అందే రమేష్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
