Volunteer Association | కలిసికట్టుగా జీవిద్దాం..

Volunteer Association | కలిసికట్టుగా జీవిద్దాం..

  • రాబోయే తరాలకు సాంప్రదాయాలను, సనాతన ధర్మాలను అందించాలి
  • శివ యోగానంద సరస్వతి స్వామి

Volunteer Association | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా హిందువులందరూ ఏకమై కలిసికట్టుగా ఉండాలని, రాబోయే తరాలకు హిందూ సంప్రదాయాలను సనాతన ధర్మాలను వివరించాలని పూజ స్వామీజీ శ్రీ శివ యోగానంద సరస్వతి స్వామి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. హిందువులందరూ ఏకమయ్యే దిశగా ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనం విజయవంతమైంద‌న్నారు.

అధ్యక్షులు సిలివేరు వేణుగోపాల్, ఖండే శ్యాంసుందర్ లాల్, డాక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని హిందూ సంఘటన కోసం ఇప్పటివరకు ప్రయత్నం చేస్తుందన్నారు. హిందుత్వం బలపడిందని, హిందువుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. రాబోయే తరాలు హిందువులే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారన్నారు. హిందుత్వం లేని భారతదేశాన్ని ఊహించలేమన్నారు. ప్రపంచంలోకెల్లా ఇతర సామ్రాజ్యాలపై దండెత్తని జాతి హిందూ జాతి అని గర్వంగా చెప్పగలమన్నారు. మన దేవీ దేవతలకు కూడా ఆయుధాలు కలిగి ఉంటారన్నారు.

Volunteer Association

ఈ కార్యక్రమంలో సుమారు మహిళలు పురుషులు 1700 మంది హిందూ బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ వాసులు దుదెల సురేష్ బాబు , కసెట్టి చంద్ర, సిరిగిరి బాలాజీ, కటకం శ్యాంప్రసాద్, ఎంవి చంద్రమౌళి, చింతలపల్లి వాసు, కె.వి రవికుమార్, పండ్లాపురం వసుమతి , డాక్టర్ మాధవి ,డాక్టర్ భార్గవ్వర్ధన్ రెడ్డి , సాత్విక్ రెడ్డి, రాయసం బాబురావు తదితరులు పాల్గొన్నారు.