PURI | ఫామ్ లోకి వచ్చేనా..?

PURI | ఫామ్ లోకి వచ్చేనా..?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్(Puri Jagannath). హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందించిన పూరి.. వరుసగా ప్లాపులు కూడా ఇచ్చారు. ఇటీవల కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. దీంతో ఈసారి ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్(block buster) సాధించాలని.. కసితో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ.. పూరి సినిమా వచ్చేది ఎప్పుడు..? ఈ మూవీతో అయినా పూరి ఫామ్ లోకి వచ్చేనా..?
PURI | పూరి హీరోలు వేరు..

హీరోలను కొత్తగా ప్రజెంట్ చేయాలంటే.. పూరి తర్వాతే ఎవరైనా. పురుషులందూ పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా.. హీరోలందూ పూరి హీరోలు వేరు అని చెప్పచ్చు. పూరితో సినిమా చేస్తే.. అప్పటి వరకు ఆ హీరోకు ఉన్న ఇమేజ్(image) ను పూర్తిగా మార్చేస్తారు. అందుకనే పూరితో సినిమా చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే.. ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఇస్తుండడంతో పూరితో సినిమా చేయడానికి హీరోలు దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుకనే.. పూరి తెలుగు హీరోతో కాకుండా.. తమిళ్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు.
PURI | దటీజ్.. పూరి..

ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన పూరి.. ఆతర్వాత తీసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా ఫ్లాపులు అయ్యాయి. దీంతో కెరీర్ లో బాగా వెనకబడడంతో ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలని తపిస్తున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా పూరి తెరకెక్కిస్తోన్న మూవీలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే సంయుక్త మీనన్(Sanyukta Menon) కూడా నటిస్తుంది. ఈ సినిమాని స్టార్ట్ చేసిన ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు.. దటీజ్ పూరి అని మరోసారి నిరూపించారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అఫిషియల్(The title is official) గా అనౌన్స్ చేయనున్నారు.
PURI | నెక్ట్స్ ప్లాన్..

ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్(Puri Next Project) గురించి ప్రయత్నాలు ప్రారంభించారని వార్తలు వచ్చాయి. నాగార్జునతో పూరి.. శివమణి, సూపర్ అనే సినిమాలు తెరకెక్కించారు. ఆతర్వాత మరో సినిమా చేయాలి అనుకున్నారు. అసలు నాగ్, పూరి కాంబోలో(Nag, Puri combo) మూవీ కన్ ఫర్మ్ అంటూ ఆమధ్య ప్రచారం జరిగింది కానీ.. సెట్ కాలేదని తెలిసింది. అయితే.. ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు కానీ.. ఈ క్రేజీ కాంబోలో మూవీ ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే తెలుగులో ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు పూరి ట్రై చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే.. విజయ్ సేతుపతితో చేస్తున్న మూవీతో ఫామ్ లోకి వస్తే.. నెక్ట్స్ ప్రాజెక్ట్(Next project) త్వరగా పట్టాలెక్కుతుంది. లేకపోతే.. మరింత ఆలస్యం అవుతుంది. ఏం జరగనుందో తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
