Biggboss9Trophy | కామ‌న్ కుర్రోడికే ట్రోఫీ?

Biggboss9Trophy | కామ‌న్ కుర్రోడికే ట్రోఫీ?

  • ఈ రోజే ప్ర‌దానం…
  • రెండో ప్లేస్ కోసం బుల్లితెర న‌టులు పోటీ
  • ట్రోఫీకి దూర‌మైన సెల‌బ్ర‌టీలు

Biggboss9Trophy| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : గ‌తంలో రైతుకు ద‌క్కిన బిగ్‌బాస్ ట్రోఫీ.. ఈ సారి కామ‌న్ కుర్రోడికి ద‌క్క‌బోతుంది!.. ఈ రోజు రాత్రి ట్రోఫీ ప్ర‌దానం చేయ‌నున్నారు. క‌ళ్యాణ్ ప‌డాల(Kalyan Padala) ఓ కామ‌న్ కుర్రోడు! మొద‌టి మూడు వారాలు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని కుర్రోడు కూడా! ఆ త‌ర్వాత విజృంభ‌ణ‌.. అదే టాప్ -5కి చేర్చింది. ట్రోఫీ రేసులో ఆయ‌న మొద‌టి స్థానంలో ఉన్నాడ‌ని అన్ని సోష‌ల్ మీడియాలు చెబుతున్నాయి. అలాగే ఓటింగ్ లెక్క‌లు కూడా అలానే ఉన్నాయ‌ని స‌మాచారం. విన్న‌ర్ కోసం బుల్లితెర న‌టులు పోటీ ప‌డుతున్నారు. బులితెర‌లో ఫేమ‌స్‌గా ఉన్న తనూజ పుట్టుస్వామి, ఇమ్మానుయేల్ పోటీ ప‌డుతున్నారు.

త‌నూజ నిత్యం గొడ‌వ‌లు.. ఎమోష‌న‌ల్‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో స్థానం సంపాదించుకుంది. ఇమ్మానుయేల్ జ‌బ‌ర్ద‌స్ట్ లో ఫేమ‌స్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఒక వైపు కామెడీ, మ‌రో వైపు ఎమోష‌న‌ల్‌తోపాటు అంద‌రితో స‌ర్దుక‌పోతూ సేఫ్ గా నిలిచాడు. వీరిద్ద‌రికీ మంచి ఫాలోయింగ్(Good following) ఉంది. రీతూ చౌద‌రి వెళ్లిపోయిన త‌ర్వాత డీమాన్ ప‌వ‌న్ డిఫ‌రెంట్‌గా ప్రేక్ష‌కుల‌కు క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం డీమాన్ ప‌వ‌న్ కు కూడా ఫాలోయింగ్ పెరిగింది. ఇమ్మానుయేల్ నాలుగో ప్లేస్‌(Emmanuel fourth place)కు ప‌రిమితం అవుతారా? అనేది కూడా చ‌ర్చ జ‌రుగుతుంది. సంజ‌న మాత్ర‌మే తాను టాప్ -5 వ‌ర‌కూ రావ‌డ‌మే గ్రేట్ అనేది ఆమె చెప్పుకుంటుంది. ఎవ‌రికి ట్రోఫీ దక్కుతుందో ఈ రాత్రి తేలిపోతుంది. ఫినాలే కార్య‌క్ర‌మం ఈ రోజు రాత్రి ఏడు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతుంది.

Biggboss9Trophy| వీళ్ల‌కు నిరాశ‌లు త‌ప్ప‌వా?

Biggboss9Trophy

బుల్లి తెర ఫేమ‌స్ త‌నూజ పుట్టుస్వామి, ఇమ్మానుయేల్‌కు నిరాశ త‌ప్ప‌దా? అనేది చ‌ర్చ జ‌రుగుతుంది. మొద‌టి నుంచి బిగ్‌బాస్ ట్రోఫి(Bigg Boss Trophy) కొట్టాల‌న్న ధ్యేయంతో ఇమ్మానుయేల్ హౌస్‌లో అడుగు పెట్టాడు. ఎలాగైనా క‌ప్ కొట్టాల‌ని ఉద్దేశంతోనే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ కూడా ఆడాడు. త‌నూజ పుట్టుస్వామి కెప్టెన్సీ అయ్యే వ‌ర‌కూ నిరాశ‌, ఎమోష‌న‌ల్‌తోనే బిగ్ బాస్‌లో ఉండేది. కెప్టెన్సీ అయిన త‌ర్వాత మాన‌సిక బ‌లం పెరిగింది. అప్ప‌టి నుంచి క‌ప్(cup) కొట్టాల‌ని ఆశ పెంచుకుంది. టాప్‌-5లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎలాగైనా ట్రోఫీతో బ‌య‌ట‌కు రావాల‌న్నా కోరిక‌తో ముందుకు క‌దిలింది. క‌ప్పు కొట్టాల‌ని వీరిద్ద‌రి ఆశ‌ల‌పై క‌ళ్యాణ్ ప‌డాల నీళ్లు పోశాడు.

Biggboss9Trophy| ఎనిమిది సీజ‌న్‌ల్లో మ‌హిళ‌కు ద‌క్కిన ట్రోఫీ

Biggboss9Trophy

బిగ్ బాస్ -9 సీజ‌న్‌కు వ‌చ్చినా.. ఇంత వ‌ర‌కూ ట్రోఫీ మ‌హిళ‌ల‌కు ద‌క్క‌లేదు. ఎనిమిది సీజ‌న్‌(Season eight)ల్లో పురుషుల‌తో స‌మానంగా లేడీస్ పోరాటం చేసిన‌ప్ప‌టికీ ట్రోఫీ మాత్రం ద‌క్క‌లేదు. ఈ సీజ‌న్‌లో త‌నూజ‌కు ట్రోఫీ వ‌స్తుంద‌ని, బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్న మొదటి మ‌హిళ ఆమె అవుతుంద‌ని ఆమె అభిమానులు భావించారు. కానీ ఆమె రెండో ప్లేస్‌కు ప‌రిమితం అవుతుంద‌ని అంచ‌నాలు, సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సారి క‌ళ్యాణ్ ప‌డాల‌కు ట్రోఫీ(Trophy for Kalyan Padala) వెళితే ఈ సారి కూడా మ‌హిళ‌ల‌కు నిరాశే క‌లుగుతుంది. సీజన్ 1 – 2017 లో శివ బాలాజీ విన్న‌ర్‌, ఆదర్శ్ 2018లో సీజ‌న్ -2 లో గీతా మాధురి, 2019లో సీజ‌న్ -3లో శ్రీముఖి ర‌న్న‌ర్‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఈ సారి త‌నూజ కూడా ర‌న్న‌ర్‌కు ప‌రిమిత‌మైతే మూడో మ‌హిళ అవుతుంది.

CLICK HERE TO READ నందమూరి హీరోలకు సీక్వెల్ కలిసి రాలేదా

CLICK HERE TO READ MORE

Leave a Reply