MLA Kadiyam Srihari | స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉత్కంఠ

MLA Kadiyam Srihari | స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉత్కంఠ
- -కడియం కార్యక్రమానికి కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్
- -ఫ్లెక్సీ పాలిటిక్స్ ఎఫెక్ట్…అప్రమత్తమైన పోలీసులు
- -కడియం వర్సెస్ తాటికొండ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ అలర్ట్
- -ఘన్‌పూర్ నలుదిక్కులా స్పెషల్ పార్టీ బెటాలియన్
- -అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ
- -మొత్తానికి వేడెక్కిన రాజకీయ వాతావరణం
MLA Kadiyam Srihari | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గంలోని 7 మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. తాజాగా నిన్న చోటుచేసుకున్న ఫ్లెక్సీ రాజకీయాల వివాదం, అలాగే కడియం వర్సెస్ తాటికొండ వరుస ఘటనలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముందని తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే సభకు రానున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకుంటారనే పోలీసులు ముందస్తుగా అంచనా వేశారు.

ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఘన్‌పూర్ పట్టణంలో భారీ పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. నలుదిక్కులా స్పెషల్ పార్టీ బెటాలియన్, అదనపు పోలీస్ బలగాలు మోహరించడంతో పట్టణం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. కీలక ప్రాంతాల్లో స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. మొత్తంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కినప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని పూర్తిగా నియంత్రణలో ఉంచారు. చివరగా కార్యక్రమం ముగిసే వరకు ఎలా ఉంటుందో స్థానిక ప్రజలు అయో మయంలో ఉన్నట్లు తెలుస్తుంది.

