Jannaram | యాప్ లోనే యూరియా..

Jannaram | యాప్ లోనే యూరియా..
Jannaram, ఆంధ్రప్రభ : రైతులు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ స్మార్ట్ యాప్ లోనే యూరియాను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయశాఖ అధికారి (ఎంఏఓ) గొర్ల అంజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారికంగా విడుదల చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, తాము సూచించిన లింక్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
గ్రామాలలోని ప్రతి రైతు భరోసాకు అనుసంధానమైన మొబైల్ నెంబరుతో లాగిన్ అయి, ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా పట్టా పాస్ బుక్ నెంబరు, సాగు చేస్తున్న పంట విస్తీర్ణం ఎంటర్ చేస్తే రైతులకు అవసరానుసారంగా యూరియా బ్యాగుల సంఖ్య యాప్ లో చూపిస్తుందని ఆయన తెలిపారు. తదుపరి మండలంలోని డీలర్ షాప్ ని ఎంపిక చేసి బుకింగ్ చేసుకోని తప్పనిసరిగా 24 గంటల లోపు వెళ్లి తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం యూరియా మాత్రమే యాప్ లో అందుబాటులో ఉందని, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఇప్పటికీ పాత విధానంలోనే లభిస్తాయని, పూర్తి వివరాలకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.
