జనగణన పై కళాకారుల గొల్ల సుద్దుల ప్రదర్శన

కడెం, ఆంధ్రప్రభ : జనగణన సర్వేలో ప్రజలంతా పాల్గొని తమ వివరాలను సరైన విధంగా అందించాలని కళాకారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి కుటుంబ వివరాలు, టాయిలెట్లు, బాత్రూములు, కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య తదితర వివరాలను అందించాలని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కళాకారులు, ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ హెచ్‌ఎం నల్ల రామ్‌రెడ్డి, ఎలగడప ఎంపీపీ ఎస్‌హెచ్‌ఎం కూచనపెల్లి శ్రీనివాస్, జానపద కళాకారుడు సాయిరాజ్, కంజర కళాకారుడు రాజేశ్వర్, కెమెరామెన్ రాజు కలిసి గొల్లసుద్దుల కళాప్రదర్శన రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఐదు నిమిషాల నిడివిగల వీడియో రూపొందించి గ్రామాల్లో స్వచ్ఛందంగా మొబైల్ ఫోన్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ప్రతి పదేళ్లకోసారి నిర్వహించే జనగణన సర్వే ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల సంఖ్య, వారికి ప్రభుత్వం అందించాల్సిన సౌకర్యాలపై సమాచారం సేకరిస్తారని కళాకారులు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ కళాప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Leave a Reply