200 acres | కేకే ఓసీ ముంపు పేరుతో భూకబ్జాలకు కుట్ర

200 acres | కేకే ఓసీ ముంపు పేరుతో భూకబ్జాలకు కుట్ర

  • నోటిఫికేషన్ నిలిపివేయాలి, దళారులపై చర్యలు తీసుకోవాలి
  • గ్రామస్తుల ఆందోళన
  • బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కు వినతి

200 acres | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : కేకే ఓసీ ముంపు ప్రాంతం పేరుతో సోమగూడెం (కే), లంబాడి తండా (కే) గ్రామాల్లోని ఇండ్ల స్థలాలు, సాగు భూములను కాజేయడానికి దళారులు పథకం రచిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులిచ్చిన తాజా నోటిఫికేషన్‌(Notification)తో ఈ కుట్ర కోణం బయటపడిందని పేర్కొంటూ, నోటిఫికేషన్‌ను తక్షణమే నిలిపివేసి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమగూడెం (కే), లంబాడి తండా (కే) గ్రామస్తులు సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవితో కలిసి సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల వెలువడిన కేకే ఓసీ ముంపు ప్రాంతానికి సంబంధించిన 146 సర్వే నంబర్లలో 200 ఎకరాల భూమి(200 acres of land)పై జారీ చేసిన నోటిఫికేషన్‌పై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు సాగు చేయని వ్యక్తులు, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు, అలాగే గ్రామం, భూమికి ఏమాత్రం సంబంధం లేని వారి పేర్లు నోటిఫికేషన్‌లో చేర్చినట్లు ఆరోపించారు. నిజమైన రైతుల పేర్లు కాకుండా బోగస్ పట్టాలు పొందిన వారి పేర్లతో పరిహారం దండుకునేందుకు దళారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

అంతేకాకుండా, సోమగూడెం, లంబాడి తండా (కే) గ్రామ పంచాయతీల పరిధిలోని ఇండ్లడుగు స్థలాలను కూడా ముంపు ప్రాంతంగా చూపిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి నోటిఫికేషన్‌లో చేర్పించారని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ ధనాన్ని(government money) దుర్వినియోగం చేసే ప్రమాదకర ప్రయత్నమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేసి సోమగూడెం, లంబాడి తండా గ్రామాలను కాపాడాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలోబుగ్గగూడెం సర్పంచ్ నవనందుల పుష్పలత, యువజన కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షుడు కనుకుల రాకేష్, సింగరేణి కార్మికుల సంఘం నాయకుడు భుక్యా ప్రవీణ్ నాయక్, యూత్ నాయకులు, వార్డు సభ్యుడు తొడేటి ప్రశాంత్‌తో పాటు గ్రామస్తులు బూట్ల వెంకటలక్ష్మి, అజ్మీరా లక్ష్మి, ఇస్లావత్ మమత, నరేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply