Gudivada | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Gudivada | పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • పల్స్ పోలియో అవగాహన ర్యాలీ

Gudivada | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల‌ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. డిసెంబర్ 21న‌ పోలియో డేను విజయవంతం చేద్దామ‌న్నారు. 21వ తేదీ ఆదివారం పోలియో డే సందర్భంగా… ఈ రోజు గుడివాడ పట్టణంలో ఏజికే స్కూల్ వద్ద పోలియో వ్యాక్సినేషన్ అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్, నెహ్రూ చౌక్ మీదుగా న్యూ మున్సిపల్ కార్యాలయ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో.. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Gudivada

నిర్లక్ష్యానికి తావు లేకుండా తల్లిదండ్రులు ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పకుండా పోలియో వ్యాక్సినేషన్ వేయించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణంలో 60 బూత్ యాక్సిలేషన్ బూతులు ఏర్పాటు చేశామని, నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

Gudivada

పోలియోపై నిరంతర విజయం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. అధికారులతో పాటు, కూటమి శ్రేణులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి చిన్నారులందరికీ పోలియో వ్యాక్సినేషన్ అందేలా కృషి చేయాలన్నారు.

Gudivada

ర్యాలీలో ఆర్డీవో బాలసుబ్రమణ్యం, కమిషనర్ ఎస్. మనోహర్, తాసిల్దార్ కుమార్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్,గుడివాడ టిడిపి అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడడ నాగరాజు, బొంబాయి శీను, ప్రభుత్వ వైద్యులు శ్వేత, సురేష్, టీడీపీ నాయకులు గోకవరపు సునీల్, కంచర్ల సుధాకర్, నాగరాజు ఇమ్మానుయేలు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply