Electric shock | విద్యుత్ షాక్‌తో రైతు మృతి

Electric shock | విద్యుత్ షాక్‌తో రైతు మృతి

  • దౌల్తాబాద్‌ను కమ్ముకున్న విషాదం.

Electric shock | రాయపోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రం దౌల్తాబాద్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. వ్యవసాయ బావి వద్ద విద్యుత్ షాక్‌(Electric shock)కు గురైన ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా.. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

స్థానికుల కథనం ప్రకారం దౌల్తాబాద్‌కు చెందిన ఎల్లం (50). జీవనాధారంగా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నాడు. ఈ రోజు తన పొలంలోని బావి వద్ద బోరు మోటార్ స్టాటర్(motor stator) పనిచేయకపోవడంతో రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరగడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి అకాల మరణంతో భార్యతో పాటు ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. వారి ఆర్తనాదాలు అక్కడున్నవారి హృదయాలను కదిలించాయి. ఈ విషాద సంఘటనతో దౌల్తాబాద్(Daulatabad) గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.

Leave a Reply