ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి..

  • శుక్రవారం, అమావాస్య…
  • అమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు…
  • కిక్కిరిసిన క్యూలైన్లు.. అధికారుల విస్తృత ఏర్పాట్లు…
  • ప్రత్యేక పూజలకు డిమాండ్…
  • చండీ హోమంలో విశేషంగా పాల్గొన్న భక్తులు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఇంద్రకీలాద్రి మొత్తం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన శుక్రవారంనికి తోడు అమావాస్య కావడంతో కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో క్యూ లైన్ అన్ని కిక్కిరిసాయి.

సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం లభించేలా పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయకులు విస్తృత ఏర్పాట్లు చేసి క్షేత్రస్థాయిలో స్వయంగా రద్దీని క్రమబద్ధీకరిస్తూ వచ్చారు. రూ.500 టికెట్లు ఉన్న అందరికీ అంతరాలయ దర్శనాన్ని కల్పించిన అధికారులు త్వరగా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.

అర్జీత సేవలకు డిమాండ్..

కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమావాస్య శుక్రవారం కావడంతో ఆదిదంపతుల సన్నిధిలో వివిధ ఆర్థిక సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుప్రభాత సేవ ఖడ్గమాల జనాలంక లక్ష కుంకుమార్చన చండీయాగం శ్రీచక్ర నవావారార్చీన, శాంతి కళ్యాణం అష్టోత్రం సహస్రనామం ఇలా అన్ని పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన యాగశాలలో నిర్వహించిన చండీయాగం లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేకంగా పూజించారు.

Leave a Reply