Bodhan | ట్రాక్టర్ ఢీకొని.. ఒక‌రు మృతి..

Bodhan | ట్రాక్టర్ ఢీకొని.. ఒక‌రు మృతి..

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం కల్దుర్కి శివారులో ఇసుక రవాణా చేస్తున్న‌ ట్రాక్టర్ ఢీకొనడంతో రాము(60) అనే వ్యక్తి మృతిచెందాడు. ఇవాళ‌ ఉదయం మంజీరా నుంచి ఇసుక తీసుకువస్తున్న ట్రాక్టర్ బోధన్ నుంచి ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న రామును ఢీకొంది. ట్రాక్టర్ డీకోడంతో రాము అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply