తూప్రాన్ : తూప్రాన్ మండలం నాగులపల్లి జాతీయ రహదారిపై గల వాగులోకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకడంతో గమనించిన స్థానికులు తల్లిని కాపాడగలిగారు. ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమతకు ఇద్దరు కూతుళ్లు. పూజిత (7), తేజస్విని (5). భర్త చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్న మమత సోమవారం నాగులపల్లి రహదారిపై గల వాగులోకి ఇద్దరు పిల్లలతో దూకడంతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మమతను స్థానికులు కాపాడారు. వాగులో గల్లంతైన వారిని ప్రత్యేక బృందాల ద్వారా తూప్రాన్ పోలీసులు బయటకు తీసుకువచ్చారు. ఇద్దరు పిల్లలు మృతిచెందడంతో మమత బోరున విలపించింది. తూప్రాన్ పోలీసులు, ఎస్సై సదానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.