Arrest | గంజాయి కలకలం..

Arrest | గంజాయి కలకలం..

నంద్యాలలో ఇద్దరు అరెస్ట్
2.5 కిలోల గంజాయి స్వాధీనం…


Arrest | నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల (Nandyala) పట్టణంలో గంజాయి కలకలం రేపింది. అరకు వ్యాలీ నుంచి రాయలసీమకు గంజాయి తీసుకు వచ్చిన ఇద్దరు పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. 2.5 కిలోల గంజాయి (Marijuana)ని, ఓ కారును స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నంద్యాల ఏ ఎస్ పి.మందా జావళి ఆల్ఫోన్స్ గురువారం తెలిపిన వివరాల మేరకు… నంద్యాల పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో విశాఖపట్నం జిల్లా అరకు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుండి గాజులపల్లి మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్ గంజాయి (Marijuana)ని కొనుగోలు చేశాడు. తన షిఫ్ట్ డిజైర్ కారులో నంద్యాల కు తీసుకు వచ్చాడు. బసాపురం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా కు నంద్యాలలో గంజాయిని అందజేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల మూడవ పట్టణ సీఐ కంబగిరి రాముడు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఎక్సైజ్ ఎస్ ఐ వరప్రసాద్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

Leave a Reply