GameChanger | ఆలోచనల్ని పసిగడుతుంది

GameChanger | ఆలోచనల్ని పసిగడుతుంది
కృత్రిమ మేథ (ఏఐ) ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతికత #మానవుల్ని ఊహాతీత ప్రపంచం వైపు నడిపిస్తోంది. మనుషుల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఏఐ, అదే మనుషుల మెదళ్లను క్షణాల్లో చదివేసేస్థాయికి అభివృద్ధి చెందడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. కొత్తగా వచ్చిన ఓ ఏఐ మోడల్ ఇలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. దృశ్య, సందర్భోచిత సంకేతాలను నిజ సమయంలో అర్ధం చేసుకోవడం ద్వారా మానవ చర్యలను ఊహించగలిగే అపూర్వమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. కదలికలకు ప్రతిస్పందించడానికి భిన్నంగా మరుసటి క్షణం మానవుల చర్యను, ప్రతిస్పందనను గురించి ఈ కొత్త ఏఐ ఆలోచిస్తుందట. టెక్సాక్ ఎఎం యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఓమ్ని ప్రెడిక్ట్ అనే నూతన ఏఐ మోడల్‌ను ఆవిష్కరించారు. డ్రైవర్ రహిత కార్ల భద్రతను మెరుగుపరచడానికి వారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.
GameChanger | ఈ ఓమ్ని ప్రెడిక్ట్ వ్యవస్థ ప్రత్యేకత

పాదచారుల ప్రవర్తనను ముందుగా అంచనా వేయడానికి మల్టిdమోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎంఎల్‌ఎల్‌ఎం)ను ఉపయోగించిన మొట్టమొదటి ఏఐ వ్యవస్థ ఈ ఓమ్ని మోడల్ కావడం విశేషం. ఇది అధునాతన చాట్‌బాట్‌లు, ఇమేజ్ రికగ్నిషన్‌లో ఉపయోగించే అంతర్లీన సాంకేతికతను ఉపయోగిస్తుంది. కానీ దానిలక్ష్యం భిన్నంగా ఉంటుంది. తాను చూసిన దృశ్యాన్ని సందర్భోచిత వివరాలతో కలిపి విశ్లేషించడం ద్వారా, ఒక వ్యక్తి మరుసటి క్షణాల్లో ఏం చేయబోతున్నాడో నిజ సమయంలో అంచనా వేయడం ఈ ఓమ్ని ప్రెడిక్ట్ వ్యవస్థ ప్రత్యేకత. ఎలాంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే ఈ ఏఐ మోడల్ అధికశాతం కచ్చితత్వాన్ని అందించగలగని ప్రారంభదశ ప్రయోగాలలో నిర్ధారణ అయింది.
GameChanger | స్వయం ప్రతిపత్తి వాహనాలు
ఈ రోజుల్లో నగరాలంటే ఓ పద్మవ్యూహం. వాహనాల రద్దీతో కూడుకున్న దారులు.. జనసమ్మర్ధ ఫుట్‌పాత్‌లు సర్వసాధారణం. ఇలాంటి ప్రదేశాల్లో పాదచారుల కదలికలు అనూహ్యంగా ఉంటాయి. ఆగినట్టే అనిపిస్తుంది.. కానీ ముందుకు దూకుతారు.. ముందుకు నడిచినట్లు ఉంటారు.. కానీ నిలబడిపోతారు.. లేదా వెనకడుగు వేస్తారు. కొన్నిసార్లు వెనక్కి..ముందుకు ఊగిసలాట సందిగ్ధతతో వాహనదారుల్ని అయోమయానికి గురిచేస్తారు. ఇలాంటి దృశ్యాలు నగర రహదారుల్లో నిత్యకృత్యం అని ఓమ్ని ప్రిడిక్ట్ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకుడు, సెంటర్ ఫర్ అటానమస్ వెహికిల్స్ అండ్ సెన్సార్ సిస్టమ్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ సరిపల్లి వెల్లడించారు. మా కొత్త మోడల్ భవిష్యత్‌లో స్వయంప్రతిపత్తి డ్రైవింగ్‌ను సురక్షితం చేస్తుంది. చుట్టూ ఉండే వాహనాల కదలికలతోపాటు, మానవుల ప్రవర్తననూ అంచనా వేయడం దీని ప్రత్యేకత. ఈ విధానం స్వయం ప్రతిపత్తి వాహనాలు (డ్రైవర్ రహిత) రద్దీగా ఉండే పట్టణప్రాంతాల్లో, వీధుల్లో ప్రమాదాలకు గురికాకుండా సజావుగా ప్రయాణించేందుకు అత్యంత కీలకం కాబోతుందని చెప్పారు.
GameChanger | తదుపరి కదలికను అంచనా
రోడ్డుపైనున్న వాహనంలో ఇలాంటి పకడ్బందీ వ్యవస్థ ఒకటి ఉందని తెలిస్తో పాదచారుల మానసిక పరిస్థితిలోనూ మార్పు వస్తుందని సరిపల్లి శ్రీకాంత్ చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లేదా రద్దీమార్గంలో మానవ డ్రైవర్‌తో పోల్చితే, ఏఐ వాహనం మిగతా వాహనాలు లేదా పాదచారుల్ని ట్రాక్ చేస్తుంది. వారి శరీర భంగిమను బట్టి తదుపరి కదలికను అంచనావేస్తుంది. దానికి అనుగుణంగా తన గమనానికి ప్రణాళికలు వేసుకుంటుంది. తద్వారా అయోమయ, గజిబిజి, ఉద్రిక్త ప్రతిష్ఠంభనలు తగ్గుతాయి.
రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. రహదారులపై సాఫీగా ప్రయాణించొచ్చు అని శ్రీకాంత్ వివరించారు. మరీ ముఖ్యంగా బెదిరింపు సంకేతాలు ప్రదర్శించే వ్యక్తుల విషయంలో మా ఈ ఓమ్ని ప్రెడిక్ట్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే సదరు వ్యక్తి ప్రవర్తనను, ఆలోచనను అంచనావేసి రాబోయే ముప్పును తప్పించడానికి దోహదం చేస్తుందని శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి ఏఐ వ్యవస్థ సైనిక, అత్యవసర కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బందికి గేమ్ ఛేంజర్ కావొచ్చని అభిప్రాయపడ్డారు.
CLICK HERE TO READ Homeguard | పాత్ర కీలకం..