Railway Employees | డీఆర్‌ఎంకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ వినతి

Railway Employees | డీఆర్‌ఎంకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ వినతి

Railway Employees | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి బ్రాంచ్ పరిధిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే (Railway Employees)ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్‌ను కోరారు. ఈ రోజు బెల్లంపల్లికి వచ్చిన సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎంను సంఘ్ బ్రాంచ్ సెక్రటరీ జి.శివ, బ్రాంచ్ వైస్ చైర్మన్ మనోజ్ కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టేషన్ ఆవరణలో పార్కింగ్ ఏరియా వద్దకు మార్చిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి స్టేషన్ ఎదురుగా ఉన్న పాత స్థలంలోనే ప్రతిష్ఠించాలని కోరారు. అలాగే రైల్వే కాలనీకి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా చేయాలని, సీ అండ్ డబ్ల్యూ, ఎలక్ట్రికల్(Electrical) విభాగాల్లో పనిచేస్తున్న గ్రూప్–డీ సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అధిక పని భారంతో బెల్లంపల్లిలో పనిచేస్తున్న ఆపరేటింగ్ సిబ్బంది పని గంటలను 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గించాలని, లోకో పైలట్లు, ఇంజినీరింగ్(Engineering) సిబ్బంది ఐఆర్‌ఆర్‌టీ ట్రాన్స్‌ఫర్ సమస్యలను పరిష్కరించాలని డీఆర్‌ఎంను కోరారు. లోకో సిబ్బందికి సౌకర్యంగా ఉండేలా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్షా వరకు పొడిగించాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.

బెల్లంపల్లి, రేచిని, ఆసిఫాబాద్ రోడ్డు ప్రాంతాల్లో రైల్వే కార్మికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో కొత్త క్వార్టర్లు నిర్మించాలని, బెల్లంపల్లి రైల్వే స్టేషన్(Railway Station) క్రూ లాబీలో ఏసీ లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలపై స్పందించిన డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణన్, వీటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సంఘ్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ్ ట్రెజరర్ రాముడు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, తిరుపాల్ నాయక్, బత్తుల రాజలింగు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply