intelligence | పోలింగ్ సిరాను తొలగిస్తూ… పట్టుబడ్డ యువకుడు

intelligence | పోలింగ్ సిరాను తొలగిస్తూ… పట్టుబడ్డ యువకుడు
intelligence | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రం(Polling station) వద్ద బుధవారం సిరా తొలగిస్తున్న యువకుడిని ఇంటెలిజెన్స్(intelligence) పోలీసులు పట్టుకున్నారు. నయాబాదికి చెందిన ఆర్బాజుద్దీన్ ఓటు వేసి వచ్చిన మహిళల వేలిపై ఉన్న సిరా గుర్తును కెమికల్ తో తొలగిస్తుండగా పోలీసులు గమనించారు.
వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, కెమికల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దొంగ ఓట్లకు పాల్పడే ప్రయత్నంగా భావిస్తూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
