Independence | మహిళా సాధికారత కోసం..

Independence | మహిళా సాధికారత కోసం..
Independence | చల్లపల్లి, ఆంధ్రప్రభ : మహిళా సాధికారత కోసం పాటుపడిన మహా నాయకురాలు కామ్రేడ్ చండ్ర రాజకుమారి అని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి పేర్కొన్నారు. మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు కామ్రేడ్ చండ్ర రాజకుమారి 7వ వర్ధంతి మండల పరిధిలోని వక్కలగడ్డలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న రత్న కుమారి మాట్లాడుతూ… మహిళలు ఆర్ధికంగా బలపడితేనే అభివృద్ధి చెందుతారని నమ్మిన రాజకుమారి మహిళలను ఆ దిశగా చైతన్య పరిచే వారని గుర్తు చేశారు. స్వామి రామానంద తీర్ధ మిషన్ సహకారంతో ఎంబ్రాయిడరి, మగ్గం వర్క్, కుట్టు శిక్షణలు నేర్పి మహిళలు ఆర్ధిక స్వావాలంబన దిశగా అడుగులు వేసేందుకు కృషి చేసారని గుర్తు చేశారు.
ఆర్ధికంగా సంపన్న కుటుంబంలో పుట్టిన రాజకుమారి తండి చండ్ర రామలింగయ్య, బాబాయ్ కమ్యూనిష్టు పార్టీ జాతీయ నాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావుల ప్రభావంతో ప్రజా చైతన్యం వైపు నడిచారాని, మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసారన్నారు. మహిళల పై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రభుత్వాల పై అనేక పోరాటాలు చేసిన రాజకుమారి తుది శ్వాస వరకు మహిళల పక్షాన పోరాడారన్నారు. మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలిగా దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమలు నిర్వహించరన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే.. రాజకుమారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకురాలు మల్లుపెద్ది రాణి కుమారి, కంచర్ల ప్రభుకుమారి, కోటేశ్వరమ్మ, సీపీఐ నాయకులు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, నక్కా శ్రీనివాసరావు, కొల్లూరి శ్రీధర్, హనుమానుల సాయిబాబు, సిద్దాబత్తుల హేమార్జున తదితరులు పాల్గొన్నారు.
