Telangana | అసెంబ్లీ, మండలి సమావేశాలు మధ్యాహ్నం 2గంటలకు వాయిదా..
హైదరాబాద్: శాసన సభ, మండలి ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.. ఈ సందర్భంగా రెండు కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి.. వాటిపై చర్చించనున్నారు. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సమగ్ర ఇంటింటి కుల గణననపై రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. వాటిపై లఘు చర్చ జరుగుతుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ, జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య న్యాయ్ కమిషన్ రిపోర్ట్ పై ప్రకటన చేస్తారు. వాటిపై కూడా లఘు చర్చ జరుగుతుంది. కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. అలాగే మండలి కూడా వాయిదా పడింది.