Gudigandla | అభివృద్ధి కోసం

Gudigandla | అభివృద్ధి కోసం

Gudigandla| మక్తల్ , ఆంధ్రప్రభ : ఆలోచించండి.. మంచి నిర్ణయం తీసుకోండి.. చిన్నపాటి అనాలోచితం నిర్ణయం వల్ల బాధపడాల్సి వస్తుంది.. మోసపోవద్దు.. అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా సోమవారం ఆయన తన మద్దదారులతో కలిసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని గుడిగండ్ల గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా తనకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి అండతో గుడిగండ్ల గ్రామాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానని అన్నారు. గుడిగండ్ల గ్రామంలో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని గ్రామంలోని ప్రతి వ్యక్తి రాజకీయాలు పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం తనను సర్పంచ్ గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి వాకిటి శ్రీహరితో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గుడిగండ్ల గ్రామ రూపురేఖలు మారుస్తామన్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని ప్రచారంలో ప్రజలకు వివరించారు. సర్పంచ్ గా ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాల్సిందిగా గ్రామ ప్రజలను సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సి.పి.తిరుపతయ్య, కూసు రాజు, భరతసింహా రెడ్డి, కుర్మ రమేష్, సుదర్శన్ రెడ్డి, తిమ్మారెడ్డి, ఖాజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply