సర్పంచ్ అభ్యర్థికి ఆర్థిక సహాయం…

భీంగల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. భీంగల్ మండలం పల్లికొండ గ్రామ సర్పంచ్ పోటీలో, గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన మారిపెద్ది మీనా, ఆమె భర్త గణేష్ అభ్యర్థిగా నిలిచారు. వీరికి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది.

ప్రచారం నిర్వహించడానికి పెద్ద మొత్తంలో వనరులు లేని మీనా కు స్థానికులు అండగా నిలుస్తున్నారు. భర్త గణేష్, మిత్రులు, బంధువులు ఇప్పటికే అన్ని విధాలుగా ప్రచారంలో పాల్గొంటూ అండగా నిలుస్తున్నారు.

ఆర్థిక పరిస్థితిని గమనించిన గ్రామానికి చెందిన ఒడ్యాల లక్ష్మణ్ ఆదివారం రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ అభ్యర్థి భర్త గణేష్ కు అందజేశారు. ఈ సందర్భంలో ఆయన, మీనా సర్పంచ్‌గా గెలిచి గ్రామానికి నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మీనా-గణేష్‌లు, గ్రామస్తులు తనకు అండగా నిలవాలని కోరారు.

Leave a Reply