Vote | ప్రజాసేవే నా లక్ష్యం..

Vote | ప్రజాసేవే నా లక్ష్యం..

  • సర్పంచ్ అభ్యర్థి డిష్ గంగాధర్

Vote | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భీమ్‌గల్ మండల్ ముచ్కూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి లేడీస్ పర్స్ గుర్తు కు ఓరగంటి డిష్ గంగాధర్ ఎన్నికల ప్రచారంలో వేగం రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. ఉదయం తొందరగానే ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఆయ‌న‌.. తన అభిమాన నాయకులతో కలిసి గ్రామ ప్రజల సమక్షంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని పలకరించిన ఈ ప్రచార యాత్రకు స్థానిక యువత భారీగా తోడయ్యారు.

గ్రామంలో రెండుసార్లు ఉప సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం డిష్ గంగాధర్ కు బలంగా ఉంది. గ్రామం కోసం పని చేసే నాయకుడి అవసరం ఇప్పుడు ఎక్కువ. గతంలో చేసిన సేవే నా ఆయుధమ‌న్నారు. మళ్లీ అవకాశం ఇస్తే.. ముచ్కూర్ గ్రామ అభివృద్ధిని కొత్త దిశలో తీసుకెళ్తాన‌ని గంగాధర్ ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు ప్రచారంలో పాల్గొన్న వారు చెబుతున్నారు. ప్రచారం సాగిన ప్రతి వీధిలో ఆయనకు అనూహ్య స్పందన లభించింది. యువత ఎక్కడ చూసినా.. డిష్ గంగాధర్ కి భరోసా తెలిపేలా ప్రచారంలో ముందుండడం ప్రత్యేకంగా కనిపించింది. మహిళలు, పెద్దలు పలకరించి ఆశీర్వదించడం ప్రచారానికి మరింత జోష్‌ గా ప్రచారం చేస్తున్న అభ్యర్థి మీ అమూల్యమైన ఓటు త‌నకు వేసి గెలిపించాలని వేడుకోవ‌డం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అభ్యర్థి డిష్ గంగాధర్ వెంట తన అభిమాన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply