politics | భారీ మెజార్టీతో గెలిపించండి…

politics | భారీ మెజార్టీతో గెలిపించండి…
- ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
- మొండి గౌరెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొలను రమాదేవి మల్లారెడ్డి…
politics | యాచారం, ఆంధ్రప్రభ : యాచారం మండలంలో మొండి గౌరెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి పొలం రమాదేవి మల్లారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తన మద్దతుదారులతో కలిసి తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని(bless) వార్డు వార్డులో తిరుగుతూ గ్రామ ప్రజల్ని అభ్యర్థించారు.
తనతో పాటు 8మంది వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. సమస్యలన్నీ పరిష్కరించి ముందుగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తానని కోరారు. తన కుటుంబం ఏనాడు రాజకీయాల్లో(politics) లేదని, మొదటిసారిగా గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు.
గ్రామ ప్రజలందరూ.. భారీ మెజార్టీతో గెలిపిస్తే… గ్రామాన్ని జిల్లాలో ఆదర్శ గ్రామంగా నిలుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొన్నారు.
