Quality Food | ప్రజాసేవకు జీవితాన్ని అంకితమిస్తా

Quality Food | ప్రజాసేవకు జీవితాన్ని అంకితమిస్తా

ఎన్మనగండ్ల సర్పంచ్ అభ్యర్థి కామునిపల్లి చంద్రశేఖర్ రెడ్డి

Quality Food | నవాబుపేట, ఆంధ్రప్రభ : తనకు ప్రజాసేవ చేసే అవకాశమిస్తే తన రాజకీయ జీవితాన్ని ప్రజా సేవకు అంకితం ఇస్తానని యన్మానుగండ్ల సర్పంచ్ అభ్యర్థి కాముని పల్లి చంద్రశేఖర్ రెడ్డి ఓటర్లకు విన్నవించారు. ఇవాళ‌ ఆయన గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, తమను గెలిపిస్తే ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామంలో ఎన్నో సమస్యలున్నాయన్నారు. గ్రామంలో వైద్య సేవలు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. లాభదాయక వ్యవసాయం జరిగే విధంగా ఉద్యాన పంటల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు.

Leave a Reply