Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి

Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి
- జిల్లా వైద్యాధికారిణి అనిత
Awareness Meeting | జన్నారం, ఆంధ్రప్రభ : వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు ఎన్నికల విధుల తరుణంలో నేతలకు దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎస్.అనిత అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే వైద్య శిబిరాలలో విధులు నిర్వహించే వైద్య ఉద్యోగులకు, ఆశా కార్యకర్తలకు మంచిర్యాల జిల్లా జన్నారం పీహెచ్సీలో ఇవాళ సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎన్నికల కేంద్రంలో నిర్వహించే శిబిరం వద్దకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకూడదన్నారు. ప్రతి ఉద్యోగి శిబిరంలో యూనిఫామ్ తో ఉండాలని, నిర్ణీత సమయానికి ముందుగానే ఉదయం 6 గంటలకు సంబంధిత అధికారికి రిపోర్ట్ చేయాలని ఆమె తెలిపారు. అవసరమైన మందులు వైద్య శిబిరంలో ఉంచుకోవాలని, ఎన్నికల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శిబిరం తరుణంలో నాయకులను కలవరాదని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, స్థానిక వైద్యురాలు గోల్కొండ ఉమాశ్రీ, డీపీఓ ప్రశాంతి, సీహెచ్ఓలు వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
