Government lands | గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది
Government lands | గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది
– ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
Government lands | గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా వేళ్ళూనుకున్న అరాచకాలకు, ప్రైవేటు పంచాయతీలకు చరమగీతం పాడిన గన్నవరం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ప్రజల ఆకాంక్షల మేరకు గన్నవరాన్ని అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు(MLA Yarlagadda Venkatarao) భరోసా ఇచ్చారు.
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో ఈ రోజు ఉదయం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో యార్లగడ్డ పాల్గొన్నారు. రూ. 78 లక్షల(Rs. 78 lakhs) డి.ఎం.ఎఫ్.టి నిధులతో 1.28 లక్షల లీటర్ల సామర్థ్యంగల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, రూ. 6 లక్షలు గ్రామపంచాయతీ నిధులు, రూ. 6లక్షల మండల పరిషత్ నిధులతో చేపట్టిన క్రికెట్ బాక్స్ నిర్మాణానికి, రూ. 20.60 లక్షల మండల పరిషత్ నిధులతో చేపట్టిన ఐదు సిమెంట్ రోడ్లకు వెంకట్రావ్ భూమి పూజ చేశారు.
Government lands |అడ్డుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉంది…

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరంలో అరాచక పాలన అంతమయి అభివృద్ధి పాలన సాగుతుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు సహకారంతో గత పాలకులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని ప్రభుత్వ భూములు ఆక్రమిస్తుంటే స్థానికులు చోద్యం చూస్తుండటం సరికాదన్నారు. గతంలో పనిచేసిన తాసిల్దారులు అక్రమార్కులకు సహకరించి కోట్ల రూపాయల కూడ పెట్టారని ఆరోపించారు.
ప్రభుత్వ భూములు(Government lands) ఆక్రమణలను అడ్డుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. ఆక్రమణలపై అధికారులకు లేదా తమ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని యార్లగడ్డ కోరారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను విడగొట్టేందుకు ప్రభుత్వం కమిటీ నియమించిందని ఆక్రమణల వివరాలను కమిటీకి అందజేయాలని ప్రజల కు సూచించారు.
Government lands |యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు..
గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా సామర్ధ్యాన్ని వెలికి తీసేందుకు పలు చోట్ల గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో క్రికెట్ బాక్సులు(cricket boxes) ఏర్పాటు చేస్తున్నట్లు యార్లగడ్డ వివరించారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన యార్లగడ్డ ఈ మేరకు గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
పి.నైనవరం గ్రామంలో కృష్ణా యూనివర్సిటీ(Krishna University) పీజీ సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన యార్లగడ్డ కోలిండియా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి సీఎస్ఆర్ నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని, లేదా ఎంపీతో మాట్లాడి కమ్యూనిటీ హాల్(Community Hall) నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య, మాజీ ఎంపీపీ తోడేటి రూబెన్, ఎంపీటీసీ జోగా శివకుమారి, నాయకులు కోనేరు సందీప్, మండల రాజేష్, నాయక్, శ్రీనివాస్, వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

