Talent Test | విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

Talent Test | విద్యార్థులకు టాలెంట్ టెస్ట్
Talent Test | రెంజల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో ఆయా పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్(Talent Test) నిర్వహించారు. మండల స్థాయి ఇంగ్లీష్, ఒలంపియాడ్ అండ్ ఏడిక్వేస్ట్ టెస్ట్(Olympiad and Adequate Test) విద్యార్థులకు నిర్వహించడం జరిగింది.
ఈ టెస్ట్ లో రాణించిన విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. టాలెంట్ టెస్ట్ పేపర్లను ఎంఈఓ కట్టా అంజనేయులు(Katta Anjaneyulu) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇంగ్లీష్ కోఆర్డినేటర్ కమ్మరున్నీసా బేగం, పిఆర్టియు మండల అధ్యక్ష, కార్యదర్శులు టి సోమలింగంగౌడ్, ఏనుగు కిషోర్ కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి శంకర్, ఉపాధ్యాయులు గులాం హైమద్ పాల్గొన్నారు.
