APSRTC | మాటిచ్చారు.. పింఛన్ అందించారు
కొట్టాల్ గ్రామంలో పెన్షన్ పంపిణీ
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : పెనుకొండ సోమదేపల్లి మండలం కొట్టాల్ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) రీజనల్ చైర్మన్ పూల నాగరాజు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి నెలా 68 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తుఫాన్ ఉన్నాఈరోజు ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ మొదలైందన్నారు. ఒకటో తేదీనే 90 శాతం పెన్షన్ ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు.
వర్షంలో (RAIN)ఇంటింటికీ వస్తున్న ప్రభుత్వ సిబ్బందిని, ప్రజా ప్రతినిధుల్ని లబ్ధిదారులు అభినందిస్తున్నారని తెలిపారు. మేము ఓటుకోసం రాలేదని, ఇచ్చిన మాట కోసం ఇంటింటికీ వస్తున్నామని లబ్ధిదారులకు వివరించారు. మాటకు కట్టుబడిన సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా పెన్షన్ దారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్, క్లస్టర్లు, సింగల్ విండో అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

