Disabled games competition | 2న దివ్యాంగుల‌కు ఆట‌ల‌పోటీలు

Disabled games competition | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(International Day of Persons with Disabilities) పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా బాలుర ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో ఈ నెల 2 (రేపు)న జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీల (Disabled games competition) ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ‌ అధికారి రౌఫ్ తెలిపారు. ఈ పోటీలను 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు, 18-54 సంవత్సరాల వయసు గల మహిళా, పురుషుల దివ్యాంగులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయ‌ని చెప్పారు. ఈ పోటీలలో పాల్గొనే దివ్యాంగులు తప్పనిసరిగా (necessarily) సద‌రం, యూడీఐడీ, ఆధార్ కార్డులను తీసుకు రావాలని సూచించారు. విజేత‌ల‌కు బహుమతులు అంద‌జేస్తామ‌ని, అనంతరం వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామ‌ని తెలిపారు. ఈ పోటీలకు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పోటీ వివ‌రాలు..

  • అంధులకు రన్నింగ్, షాట్ ఫుట్, చెస్, బ‌దిరుల‌కు రన్నింగ్, షాట్ ఫుట్, జావెలిన్ త్రో
  • శారీరిక వైకల్యం (శారీరిక వైక‌ల్యం) గల వారికి షాట్ ఫుట్, జావెలిన్ త్రో, క్యారమ్
  • బుద్ధి మాంద్యం గలవారికి రన్నింగ్, షాట్ ఫుట్ పోటీలు

Leave a Reply